వాళ్ళకు శిక్ష పడాల్సిందే.. జూబ్లీహిల్స్ బాలిక కేసుపై సోను సూద్ సంచలన వ్యాఖ్యలు

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ సంఘటన పై బాలీవుడ్ స్టార్ సోను సూద్ స్పందించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ సంఘటన గురించి న్యూస్ లో చూసి షాక్ కి గురయ్యానని.. ఇది చాలా పెద్ద క్రైం అని ఆయన వెల్లడించారు. చేసింది మైనర్ ఆ.. మేజర్ ఆ.. అని కాదు… ఎలాంటి క్రైం చేశారు అనేది చూడాలి.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు సోనూ సూద్.

ఇలాంటి క్రైం కి పబ్స్ కారణం అవుతున్నాయి అనేది తప్పు… గ్రామీణ ప్రాంతాల్లో కూడా మైనర్ అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి..మనం ఆలోచించే పద్ధతిలో ఉంటుందని పేర్కొన్నారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారు అంటారు కానీ… మనం చూసే విధానం తప్పుగా ఉంటే.. చెడు ఆలోచనలే వస్తాయని అగ్రహించారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ సంఘటన నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని కోరారు సోనూ సూద్.

Read more RELATED
Recommended to you

Latest news