త్వరలో నేనేంటో మీకు చూపిస్తా – అనసూయ..!

-

ప్రముఖ టీవీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ అక్కడ గ్లామర్ డాల్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకొని.. అతి తక్కువ సమయంలోనే సినిమాలలో అవకాశాలు దక్కించుకొని మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోయిన్ల రేంజ్ లో అవకాశాలు అందుకుంటూ పారితోషకం విషయంలో కూడా అంతే ఎక్కువ తీసుకుంటూ .. బిజిగా దూసుకుపోతున్న ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంపై వివాదాలను సృష్టిస్తూ ఉంటుంది.

ఇదిలా ఉండగా తాజాగా తాను కన్నీళ్లు పెట్టుకున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ట్రెండింగ్ గా మారింది. శనివారం రోజు ఆమె ఏడుస్తూ పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ కావడంతో ఆ వీడియో పెట్టడానికి కారణం ఏంటి అనేది కూడా చెప్పి మరొకసారి ట్రోలింగ్ కి గురయింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే అందరూ అనుకుంటున్నట్టే సోషల్ మీడియా నెగిటివిటీ కి తాను ఫీల్ అవ్వడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. నా ఫీలింగ్ కోపంతో ఉండదు ఏడుపుతో ఉంటుంది.. జీవితంలో తీసుకున్న ఒక క్లిష్టమైన నిర్ణయాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఇలా చేశాను అంటూ ఆమె తెలిపింది.

 

ఇదిలా ఉండగా హేటర్స్ ను ఉద్దేశిస్తూ మరొక ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఎదుటి వ్యక్తులను తక్కువ చేసి వాళ్ళు బాధపడుతుంటే.. మళ్ళీ సానుభూతి చూపించి మీకు మీరు మంచి వాళ్ళని అనుకుంటున్నారు. అదే బాధపడిన వ్యక్తి బలంగా నిలబడితే మాత్రం తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తారు.. కపట ధోరణి అంటే ఇదేనేమో.. ఇప్పుడు నేను మాటిస్తున్నాను.. ఎంతో మందికి ఉదాహరణగా ఉండేలా జీవితంలో మరింత ముందుకు వెళ్తాను త్వరలోనే నేనేంటో చూపిస్తాను అంటూ ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news