త్వరలో జబర్దస్త్ లోకి సుధీర్.. క్లారిటీ ఇదే..!

-

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ గురించి పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న సుధీర్ తెలుగులో ఒక రేంజ్ లో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే.. మరొకవైపు సినిమాలలో హీరోగా కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోని ఇటీవల తాను నటించిన సినిమా కూడా విడుదలై ఊహించని విధంగా డిజాస్టర్ కావడంతో సుధీర్ కు మళ్లీ తీవ్ర నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాను మళ్ళీ జబర్దస్త్లోకి రాబోతున్నట్లు తానే స్వయంగా వెల్లడించారు.

జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన సుధీర్ ఆ తర్వాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షో ల ద్వారా మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు సుదీర్. వెండితెరపై అవకాశాల కోసం తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోని సైతం వదిలిపెట్టి వెళ్ళాడు అంటూ జోరుగా వార్తలు వినిపించాయి. ఇదే విషయంపై సుదీర్ పై నెగిటివ్ గా కూడా కామెంట్లు వినిపించాయి. కానీ ఈ వార్తలపై తాజాగా స్పందించాడు సుధీర్. ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను జబర్దస్త్ షో ని ఎందుకు వీడాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చాడు.

ఇంటర్వ్యూలో భాగంగా సుధీర్ మాట్లాడుతూ.. గత ఆరు నెలల క్రితం నేను కొంత వరకు ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉన్నాను. నా పరిస్థితులను జబర్దస్త్ యాజమాన్యానికి చెప్పుకొని అక్కడి నుంచి బయటకు వచ్చాను . ఇప్పుడు అన్ని సమస్యలు సాల్వ్ అయ్యాయి. నేను పడిన కష్టాలు అన్నీ వారికి వినిపించాను. మళ్లీ జబర్దస్త్ కి రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పడంతో జబర్దస్త్ వాళ్ళు కూడా సరే అన్నారు. త్వరలోనే జబర్దస్త్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాను అంటూ అభిమానులకు శుభవార్త తెలిపారు సుధీర్.. మొత్తానికైతే జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడానికి కారణాలు చెప్పడంతో ఈయనపై వచ్చిన నెగిటివ్ వార్తలన్నీ కూడా అసత్యాలే అని తేలిపోయాయి. మొత్తానికైతే సుదీర్ మళ్ళీ జబర్దస్త్ కి వస్తున్నాడు అని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news