నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, రానా హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి రానా, ప్రియమణి, సాయి పల్లవి ఫస్ట్ లుక్స్ రివేరెల్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి ఒక కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుంచి తాజాగా వెన్నెల అంటూ సాగే పాటను విడుదల చేశారు.
సాయిపల్లవి పుట్టిన రోజు ఇవాళ అయిన నేపథ్యంలో ఈ సాంగ్ ను విడుదల చేసి.. ట్రీట్ ఇచ్చింది చిత్ర బృందం. ఇక ఈ సాంగ్ సాయిపల్లవి చాలా భిన్నంగా కనిపించారు. కాగా… ఈ ఏడాది జూలై 1వ తేదీన ఈ సినిమాను రిలీజ్ కానున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మొదట్లో ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినా.. చివరికి.. థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది చిత్ర బృందం.