మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ RC15 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఏపీలోని వైజాగ్ లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
వైజాగ్ మధురవాడలో రామ్ చరణ్ పిక్చర్ షూటింగ్ లో పాల్గొనపుడు అంతరాయం ఎదురైనట్లు తెలుస్తోంది. మధురవాడలోని పాత పోలీస్‌స్టేషన్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, రామ్ చరణ్ అభిమానులు అక్కడకు భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు టాక్. దాంతో కొంతసేపు షూటింగ్ కు అంతరాయం ఎదురైందట.
రామ్ చరణ్ తన అభిమానులతో కొద్ది సేపు ముచ్చటించి వారితో ఫొటోలు దిగి వారిని తిరిగి వెనక్కు పంపారు. ఆ తర్వాత RC15 షూటింగ్ కంప్లీట్ చేశారు మెగా పవర్ స్టార్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ పిక్చర్ షూట్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.