మీ అభిమాన సీరియల్ మిఠాయి కొట్టు చిట్టెమ్మ సరికొత్త మలుపులతో..

-

సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!

హైదరాబాద్, 20 జూలై: జీ తెలుగు ప్రారంభమైనప్పటి నుంచి ఆకట్టుకునే కథనాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ప్రతి సీరియల్లోని కథ, పాత్రలు ప్రేక్షకుడి నిజ జీవితంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేస్తూ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన కథాంశం, ప్రతిభావంతులైన నటీనటులు, సిబ్బందితో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ మిఠాయికొట్టు చిట్టెమ్మ.

ఈ సీరియల్ 21 సంవత్సరాల తర్వాత జరిగే కథలోని సరికొత్త ట్విస్ట్తో ప్రేక్షకులను మరింత అలరించేందుకు సిద్ధమైంది. మిఠాయికొట్టు చిట్టెమ్మ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు, మీ జీ తెలుగులో!

చిట్టెమ్మ, రవిల కారు యాక్సిడెంట్ తర్వాత సీరియల్ మరింత రసవత్తరంగా సాగుతుంది. చిట్టి అని ముద్దుగా పిలుచుకునే చిట్టెమ్మ కూతురు ఒక్కతే ప్రమాదం నుంచి బయటపడటంతో ఆమె తల్లిదండ్రుల అసలు భవితవ్యం ఏంటో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. 21 ఏళ్ల గ్యాప్ తర్వాత చిట్టి సత్యభామగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే, సత్యభామ జీవితం, ఆమె చుట్టూ జరిగే సంఘటనలు కథలో మరింత కొత్తదనాన్ని తీసుకొస్తాయి.

చిట్టి పాత్రను సత్యభామగా సంగీత పోషించనుండగా, ఈ సీరియల్ లో ప్రధాన పాత్రధారి మాధవ్ పాత్రను కశ్యప్ పోషించనున్నారు. కాంతమ్మ పాత్రను అనూషరావు నటిస్తున్నారు. ఈ సరికొత్త ట్విస్ట్తో రానున్న సీరియల్ని మీరూ మిస్సవకుండా చూసి ఆనందించండి.

21 ఏళ్ల తర్వాత సత్యభామగా మారిన చిట్టి.. సరికొత్త ట్విస్ట్తో మిఠాయికొట్టు చిట్టెమ్మ, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు. మీ జీ తెలుగులో మాత్రమే!

Read more RELATED
Recommended to you

Latest news