Iswarya Menon: స్పై హీరోయిన్ కు జాక్ పాట్.. పవన్ సరసన అవకాశం!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మరింత పాపులారిటీ దక్కించుకుంటున్నారు పవన్ కళ్యాణ్.. తాజాగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేసే పనిలో ఉన్న ఈయన హరిహర వీరమల్లుతో పాటు వినోదయ సీతం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు.

యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టయినర్ ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి సినిమా వర్కింగ్ టైటిల్ ఇదే. అయితే.. ‘స్పై’ మూవీలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య మీనన్… పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో ఓ కీలకపాత్రలో ఐశ్వర్య కనిపించనున్నారట. ఓ పాత్ర కోసం మూవీ టీం తాజాగా ఆమెను సంప్రదించగా… వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news