జిమ్​లో మహేశ్ బాబు వర్కవుట్.. జక్కన్న సినిమా కోసమేనా..?

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు జిమ్​లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. ఇంటెన్స్ వర్కవుట్​తో కండలు పెంచేస్తున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నా ఫేవరెట్‌ స్కిల్ మిల్‌ ఫినిషర్‌తో నా శనివారం మొదలైంది. ఒక నిమిషం ల్యాండ్‌మైన్‌ ప్రెస్‌, ఒక నిమిషం కెటిల్‌బెల్‌ స్వింగ్స్‌, ఒక నిమిషం స్కిల్‌మిల్‌ రన్‌ పూర్తి చేశాను. మీరు ఎన్ని సెట్స్‌ చేయగలరు అంటూ ప్రశ్నిస్తూ వీడియోను పోస్ట్‌ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది.

మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా ఈ పోస్టును షేర్ చేశారు. దేవుడి ఇలాంటి అబ్బాయిలను పుట్టించడం ఎప్పుడో ఆపేశాడు అంటూ క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ పోస్టు ట్రెండ్ అవుతోంది. అయితే మహేశ్ బాబు వర్కవుట్ చేస్తోంది దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమా కోసమేనేమో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహేశ్ యంగ్​గా కనిపించడానికి రహస్యం ఇదేనా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news