డ్యాన్స‌ర్‌తో హాట్ యాంక‌ర్‌ పెళ్లికి రెడీ!

బుల్లితెర‌పై శ్రీ‌ముఖి ఓ సంచ‌ల‌నం. తృటిలో బిగ్‌బాస్ సీజ‌న్ 3 టైటిల్‌ని పోగొట్టుకున్నా త‌న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. సోష‌ల్ మీడియాలో త‌న హాట్ హాట్ పిక్స్‌తో నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇటీవ‌ల శ్రీ‌ముఖి పెళ్లికి రెడీ అవుతోందంటూ వార్త‌లు రావ‌డం వాటిని శ్రీ‌ముఖి ఖండించ‌డం తెలిసిందే. అయితే తాజాగా స్వ‌యంగా శ్రీ‌ముఖి ఓ డ్యాన్స‌ర్‌ని పెళ్లి చేసుకుంటాన‌ని వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

`బిగ్‌బాస్ సీజ‌న్ 3` త‌రువాత సెల‌బ్రిటీగా మారిపోయిన శ్రీ‌ముఖి ఇలీవ‌ల క్రేజీ యాంక‌ర్ సుమ నిర్వ‌హిస్తున్న క్యాష్ షోలో గెస్ట్‌గా పాల్గొంది. ఇదే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న పండు అనే డ్యాన్స్ డ్యాన్స్‌కు ముగ్ధురాలైన శ్రీ‌ముఖి సుమ సాక్షిగా ప్ర‌పోజ్ చేసింది. త‌న‌ని పెళ్లి చేసుకోవ‌డానికి త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్ప‌డంతో యాంక‌ర్ సుమ ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. మీకు ఇష్ట‌మైతే నాకూ ఇష్ట‌మే అని డ్యాన్స‌ర్ పండు అన‌డంతో శ్రీ‌ముఖి కూడా షాక్ కి గురైంద‌ట. ఆ త‌రువాత వెంట‌నే తేరుకుని పండుతో క‌లిసి టైటానిక్ పోజులిస్తూ శ్రీ‌ముఖి మురిసిపోవ‌డంతో డ్యాన్స‌ర్ పండు ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయింది.