అనంతపురం తాడిపత్రి రాజకీయాల్లో జేసీ దివాకర్‌రెడ్డి తిరుగులేని నేత. ఇప్నటి వరకు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. కాంగ్రెస్ పార్టీలో అనంత రాజకీయాల్లో కీలక నేతగా చక్రం తిప్పిన జేసీ రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్‌కి గుడ్‌బై చెప్పేసి తెలుగు దేశం పార్టీలోకి జంపైన విషయం తెలిసిందే. అనంత రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న ఆయన తమ్ముడి కారణంగా గత కొన్ని రోలుగా మౌనం పాటిస్తున్నారు.
రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. ఇటీవల జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు దళిత పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించడంతో ఆయనని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకింద అరెస్ట్ చేసి అనంతపురం జైలుకి తరలించారు. దూకుడు స్వభావం కలిగిన తమ్ముడి కారణంగా జేసీ ప్రస్తుతం రాజకీయంగా మౌనం పాటిస్తుండటం టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాడిపత్రిలో తిరుగులేని నేతలుగా ఎదిగిన జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏమీ చేయలేక జేసీ ప్రస్తుతం ఫామ్ హౌజ్‌కు పరిమితం కావడం ఆసక్తికరంగా మారింది. జేసీ ట్రావెల్స్‌తో పాటు వారి ఆస్తులపై జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడంతో చేసేదేమీ లేక జేసీ ఫామ్ హౌస్‌లోకి వెళ్లిపోయి సైలెంట్ అయిపోవడంతో ఆయన క్యాడర్ బలహీనంగా మారినట్టు చెబుతున్నారు. వైఎస్ జగన్‌పై సంచలన విమర్శలు చేసిన జేసీ మళ్లీ ఎప్పుడు తన మౌనం వీడతారా అని ఆయన క్యాడర్ ఎదురుచూస్తోందట.