ఆలికి పవన్ అసలు రంగు తెలిసింది అందుకే వైసిపిలో చేరాడు..!

-

పవన్ కళ్యాణ్ పేరు వింటేనే ఇంత ఎత్తున లేచే శ్రీ రెడ్డి.. పవన్ ఎక్కడ దొరుకుతడా.. ఎలా టార్గెట్ చేయాలా అని ఎదురుచూస్తుంది. పవన్ మీద.. జనసేన మీద నోటికొచ్చినట్టు మాట్లాడే శ్రీ రెడ్డి టాలీవుడ్ కమెడియన్ ఆలి వైసిపిలో చేరడం పట్ల మరోసారి పవన్ ను టార్గెట్ చేసింది. పవన్ కు మంచి స్నేహితుడైన ఆలి పవన్ జనసేనలో చేరకుండా వైసిపిలో చేరడం పట్ల శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.

పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం ఆలికి తెలిసిపోయింది అందుకే ఆయన జగన్ వెంట వెళ్లాడని అంటుంది శ్రీ రెడ్డి. అంతేకాదు పవన్ ఈమధ్య కావాలని ఆలీని పట్టించుకోలేదని.. కలిసేందుకు వెళ్లినా సరైన రెస్పాన్స్ లేకపోవడంతో ఆలి హర్ట్ అయ్యారని అందుకే జనసేనని కాదని వైసిపిలో చేరారని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి. ముందు ఫ్యామిలీని ఆ తర్వాత స్నేహితులను టికెట్ ఇవ్వనని చెప్పుకునేందుకు పవన్ అలా చేశారని అంటుంది.

ఆలీ ఇప్పటికే సొంత జిల్లాతో పాటుగా రాజమండ్రిలో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. ఆయన దగ్గరకు వచ్చి సాయం అడిగితే మాట సాయమే కాదు డబ్బు సాయం కూడా చేస్తారని అన్నది శ్రీరెడ్డి. ఆయన ఎంతోమందికి లక్షల్లో దానం చేశారని చెప్పుకొచ్చింది. తనకు యాంకర్ గా కొన్ని ఛాన్సులు ఇప్పించారని. అలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి రాజకీయాల్లో రావడం మంచిదని అంటుంది శ్రీ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news