శ్రీదేవి డ్రామా కంపెనీ లో భార్యతో దర్శనమిచ్చిన హైపర్ ఆది.. వీడియో వైరల్..!

-

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కమెడియన్లలో హైపర్ ఆది ఒకరు. ఈయన ఇప్పుడు బుల్లితెరపైనే కాదు వెండితెరపై కూడా అలరిస్తూ దూసుకుపోతున్నారు. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎట్టకేలకు తన భార్యను శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాడు ఆది.

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఏప్రిల్ రెండవ తేదీన ఎపిసోడ్ రిలీజ్ చేయబోతుండగా అందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఎప్పటిలాగే ఆది తనదైన పంచులతో అదరగొట్టేశాడు. ఇక స్టేజ్ పై నా భార్య ఈమె అంటూ ఒక విదేశీ మహిళను పరిచయం చేశాడు. ఫేస్ కి మాస్క్ కి పెట్టుకొని కూలింగ్ గ్లాసులతో శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై మెరిసింది ఈ భామ. హైపర్ ఆది పెళ్లాన్ని చూడాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.. ఆ మాస్క్ తీసేయ్ అని ఆది అంటే.. ఆమె మాత్రం నో అంటూ సమాధానం ఇచ్చింది. కనీసం నన్నైనా చూడనివ్వు.. ఇప్పటివరకు చూడలేదు అంటూ చమత్కరించాడు ఆది.

ఇక అందుకు సంబంధించిన ప్రోమో చాలా వైరల్ గా మారుతుంది ..అంతేకాదు ప్రోమో చివర్లో ఎక్స్ట్రా జబర్దస్త్ కి కొత్త టీం రాబోతున్నట్లుగా కూడా ప్రకటించింది యాంకర్ రష్మి. ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా పాపులారిటీ దక్కించుకున్న పరేషాన్ భాయ్ టీం అబ్బాయి హైపర్ ఆదిని నువ్వెవరు అంటూ అడిగాడు. దానికి ఇంద్రజ హైపర్ ఆదికి మొగుడు వచ్చాడు అంటూ గట్టిగా అరుస్తుంది. మొత్తానికైతే ఈ ప్రోమో చాలా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news