ప్రాణభయంతో దేశం వదిలి పారిపోయిన శ్రీకాంత్. ఆ సినిమా వల్లేనా.?

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన తాజ్ మహల్ అనే చిత్రం ద్వారా ఊహించని రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక ఆయన కెరియర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి 100 చిత్రాలకు పైగా హీరోగా నటించిన ఈయన అప్పుడప్పుడు నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి మెప్పించారు. ఇదిలా ఉండగా శ్రీకాంత్ కెరియర్ లో సూపర్ హిట్ విజయాలు అందుకున్న చిత్రాలలో ఖడ్గం కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్ అవ్వడమే కాదు శ్రీకాంత్ పాత్రకి అద్భుతమైన రెస్పాన్స్ కూడా లభించింది. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీకాంత్ కనిపించాడు. ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా సీరియస్ లుక్స్ తో సన్నివేశాలను లాక్కొచ్చిన ఈయన ఇందులో పాకిస్తాన్ ను విపరీతంగా ద్వేషించే శ్రీకాంత్.. ముస్లిం లపై చేసిన కామెంట్లు అప్పట్లో పెను దుమారం సృష్టించాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమాను ఆపివేయాలంటూ ముస్లింలు ధర్నాలు చేశారు. అంతే కాదు చిత్ర బృందం బయట కనిపిస్తే.. చంపేస్తామని ఎంతో కోపంలో కూడా ఉండేవారు. ఇక సినిమా విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అశాంతి వాతావరణం నెలకొంది. ఇక సన్నివేశాలను కట్ చేసినా కూడా గొడవలు ఆగలేదు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని గమనించిన శ్రీకాంత్ తనపై ఎప్పుడైనా దాడి జరగవచ్చు అని గమనించి.. ఎప్పుడూ తన పాకెట్లో గన్ను పెట్టుకొని తిరిగే వారట. అంతేకాదు ఇక్కడ అంటే ఏమైనా చేస్తారని భయపడి అమెరికాకి కొద్ది రోజులు వెళ్ళిపోయినట్లు సమాచారం. మళ్లీ పరిస్థితి చక్కబడ్డాక ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news