కెసిఆర్ బయోపిక్ ‘తెలంగాణా దేవుడు’

-

బయోపిక్ సినిమాల సత్తా చాటుతున్న ఈ టైంలో ప్రస్తుతం ఎన్.టి.ఆర్, వైఎస్సార్, ఘంటసాల, చంద్రబాబు నాయుడు బయోపిక్ లు సెట్స్ మీద ఉన్నాయి. తమిళంలో కూడా జయలలిత, ఎం.జి.ఆర్ బయోపిక్ లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మరో సెన్సేషనల్ బయోపిక్ రాబోతుందని తెలుస్తుంది. తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవిత చరిత్రతో సినిమా వస్తుంది.

ఈ సినిమాలో కె.సి.ఆర్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడట. ఈ విషయాన్ని శ్రీకాంత్ స్వయంగా వెళ్లడించడం విశేషం. సినిమా ఆల్రెడీ మొదలైందని.. ఎలక్షన్స్ మూమెంట్ లోనే రిలీజ్ అవుతుందని అంటున్నాడు శ్రీకాంత్. మరి సినిమా ఎప్పుడు మొదలైందో ఏమో కాని కె.సి.ఆర్ బయోపిక్ లో శ్రీకాంత్ నటిస్తున్నాడని తెలియడంతో ఆ సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.

కె.సి.ఆర్ బాల్యం, రాజకీయ ప్రస్థానం, పార్టీ ఆవిర్భావం, తెలంగాణా ఉద్యమం, సిఎంగా ప్రమాణస్వీకారం ఇలా అన్ని అంశాలను ప్రస్థావిస్తూ ఈ బయోపిక్ ఉంటుందని తెలుస్తుంది. మరి శ్రీకాంత్ చేస్తున్న ఈ క్రేజీ అటెంప్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కె.సి.ఆర్ స్పీచ్ లకు సంబందించిన వీడియోలు చూస్తున్నానని చెప్పారు శ్రీకాంత్. తెలంగాణా దేవుడు అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా వివరాలు త్వరలో వెళ్లడిస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news