పెళ్లి వార్తలపై స్పందించిన శ్రీముఖి.. ఏమన్నారంటే..?

-

సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి వినిపించే వార్తలు ఎలా ఉంటాయి అంటే.. తమపై వచ్చే రూమర్స్ విని విని విసిగెత్తిపోయి ఏదో ఒక రోజు తమ కోపాన్ని బయట పెట్టేస్తూ ఉంటారు సెలబ్రిటీలు. అది పాజిటివ్ అయినా.. నెగటివ్ అయినా.. సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో ఎవరైనా లిమిట్స్ దాటితే మాత్రం కచ్చితంగా సెలబ్రిటీస్ వారికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే యాంకర్ శ్రీముఖి కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎందుకంటే కొద్ది రోజులుగా ఆమెకు పెళ్లి కుదిరింది అంటూ సోషల్ మీడియాలో కథనాలు ఎంత వైరల్ అయ్యాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

అంతటితో ఆగకుండా శ్రీముఖి ఫలాన వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకుందని.. అతడు హైదరాబాదులో పెద్ద బిజినెస్ మాన్ అని రూమర్స్ కూడా వినిపించాయి. అంతేకాదు మరొకవైపు బడా నిర్మాత వారసుడిని ఈమె వివాహం చేసుకోబోతోంది అంటూ కూడా వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ వార్తలు కాస్త శ్రీముఖి చెవిన పడ్డాయి. దీంతో మ్యారేజ్ రూమర్స్ పై చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది శ్రీముఖి.. ఈ విషయాలపై శ్రీముఖి స్పందిస్తూ.. ఒకసారి బాయ్ ఫ్రెండ్ ఎవరు అంటారు? ఇంకోసారి పెళ్లి ఎప్పుడు అంటారు? రీసెంట్ గా మా నాన్న ఫోటో బ్లర్ చేసి పెళ్లి రూమర్స్ స్ప్రెడ్ చేశారు.. మరి ఇంత దారుణమా? రోజూ ఇలాంటి వార్తలు విని విని విసుగు వస్తుంది.

నా పెళ్లి నాలుగేళ్ల తర్వాతే చేసుకుంటాను. అప్పుడు నేనే స్వయంగా ప్రకటిస్తాను. ఇప్పుడు నాకు పెళ్లి అన్న ఆలోచన లేదు అంటూ రూమర్లను కొట్టి పారేసింది. ప్రస్తుతం తన కెరియర్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చేతినిండా టీవీ షో లతో పాటు పలు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న ఈమె బ్యాక్ టు బ్యాక్ షో లతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మొత్తానికైతే తన పెళ్లి పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news