అదిరిపోయే రుచులతో మటన్ ఫెస్టివల్‌..పురుషులకు మాత్రమే ఎంట్రీ..

-

వనభోజనాలో లేక..ఏదైనా ఫంక్షనో అనుకోకండి..ఇది ఒక రాష్ట్రంలో జరిగే పండుగో అనుకోకండి..దేవాలయంలో ఘనంగా జరిగే వేడుక..అసలు జిల్లా వ్యాప్తంగా ఉన్న పురుషులు ఈ ఆలయం వేడుకలకుపెద్ద ఎత్తున తరలివస్తారు ..స్త్రీలకు ప్రవేశం లేదు..వంట చెయ్యడం నుంచి మొదలుకొని వడ్డించడం వరకూ అన్నీ కూడా పురుషులే చేస్తారు..ఇంతకీ ఆ పండుగ ఎక్కడ చేస్తారు..పూర్తి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

 

తమిళనాడులోని మధురై జిల్లాలోని తిరుమంగళం లో ఉన్న కరుప్పయర్ ముత్తయ్య ఆలయం ఉంది . తిరుమంగళంతో పాటు మధురై జిల్లా వ్యాప్తంగా ఉన్న పురుషులు ఈ ఆలయం వేడుకలకుపెద్ద ఎత్తున తరలివస్తారు.. మార్గళి మాసం లో ఉత్సవాలు జరుగుతాయి . ప్రతి ఒక్కరు తమ మొక్కులు చెల్లించడానికి ఒక్కో మేక పోతులను సంవత్సరం పాటు పెంచుతారు. వాటిని కోసి విందును ఏర్పాటు చేస్తారు.. వందకు పైగా మేక పోతులని స్వామి వారికీ నైవేద్యం గా సమర్పిస్తారు .పురుషులకి ఎంత తింటారో అంత మటన్ వడ్డిస్తారు. తాజాగా జరిగిన వేడుకల్లో ఏకంగా సుమారు 10,000 మంది పురుషులు పాల్గొన్నారు.. ఇక్కడకు వచ్చిన వారికితిన్నంత పెడతారు..ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఇక్కడ మరో విశేషం ఉంది..మహిళలకు నో ఎంట్రీ.. స్వామివారిని దర్శించుకోవాలంటే మహిళలు ఒక నిబంధన పాటించాలి . నాన్ వెజ్ విందు పూర్తి ఆయన తరువాత పురుషులు ఇస్తరులు తీయకుండా అక్కడనుండి వెళ్లిపోతారు. అవి పూర్తిగా ఎండిపోయే వరకు స్త్రీలు పరిసర ప్రాంతాలకు వెళ్లకూడదు . ఇస్తరులు పూర్తి గా ఎండిపోయి కనుమరుగైన తరువాత మాత్రమే ఆలయ ప్రవేశం ఉంటుంది. పురుషులు యధావిధిగా వచ్చే సంవత్సరం మొక్కు కోసం ఇప్పటినుంచే మేకపోతులని సంవత్సరకాలం పాటు పెంచుతారు .ఈ పండగ వందల ఏళ్లుగా ఈ పండుగ జరుగుతోందని గ్రామ పెద్దలు చెబుతున్నారు..అంతేకాదు పురుషులు ఏం కొరుకున్నా కూడా నేర వేరుతాయని అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news