పవన్ కళ్యాణ్ అనంతపురంలో.. పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తా -TDP మాజీ ఎమ్మెల్యే

-

చంద్రబాబు – పవన్ కళ్యాణ్ భేటీ పై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనంతపురంలో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తే దగ్గరుండి గెలిపిస్తానని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. తన భుజస్కందాల మీద మోసి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు.

వైఎస్ఆర్సిపి ఓటమి, జగన్ ఇంటికి పోవడమే రెండు పార్టీల లక్ష్యమని వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. జనసేన మాకు గతంలో పొత్తులో ఉన్న పార్టీ అని.. రాష్ట్రంలో ఎన్నికలకు తన వ్యూహం వేరే ఉందని పవన్ గతంలో చెప్పాడని గుర్తు చేశారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్. ఎన్నికల సమయంలో జరిగే పొత్తులపై అప్పటి పరిస్థితులు ఆధారపడి ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news