శ్రీరెడ్డినా మ‌జాకా : అర్ధరాత్రి రోడ్ల మీద శ్రీరెడ్డి బైక్‌లు ఆపి ఏం చేస్తోందంటే?

-

శ్రీరెడ్డి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెలబ్రిటీల గురించి తన అభిప్రాయాలను చెప్తూ సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తుంటుంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి శ్రీరెడ్డి అప్పట్లో చేసిన పనులు సంచలనమయ్యాయి. కాగా, గత కొద్ది రోజులుగా శ్రీరెడ్డి తమిళనాడులో ఉంటోంది. తన మకాం హైదరాబాద్ నుంచి చెన్నైకి మార్చుకుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనను కొందరు అడ్డుకుంటున్నారని, అందుకే తాను చెన్నైకి వెళ్లినట్లు పేర్కొన్న శ్రీరెడ్డి..చెన్నైలో యూట్యూబ్ చానల్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నట్లు వివరించింది. తాజాగా శ్రీరెడ్డి చేసిన పని ద్వారా మళ్లీ వార్తల్లో నిలిచింది. చెన్నై లోకల్ యూట్యూబ్ చానల్స్ శ్రీరెడ్డి ని వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ యూట్యూబర్ విసిరిన చాలెంజ్ మేరకు శ్రీరెడ్డి అర్ధరాత్రి చెన్నై రోడ్లపైన హల్ చల్ చేసింది.

రోడ్లపైన నిలబడి బైకర్స్ ను ఆపి వాళ్ల ఫోన్ నెంబర్ తీసుకోవాలని యూబ్యూటర్ చాలెంజ్ విసిరారు. అది స్వీకరించిన శ్రీరెడ్డి రోడ్లపైన నిలబడి అటుగా వచ్చిన బైకర్స్ నుంచి ఫోన్ నెంబర్లు తీసుకుంది. బైకర్లతో అలా సరదాగా శ్రీరెడ్డి ముచ్చటిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news