SSMB 29 మూవీ కోసం వారిని పక్కన పెట్టేసిన రాజమౌళి!

-

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో SSMB29 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని మహేశ్ బాబు ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..?

ఎస్ఎస్ రాజమౌళి తన ప్రతి సినిమాకి ఒకే టీమ్ను మెయింటైన్ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్లు కాస్ట్యూమ్ డిజైనర్, మ్యూజిక్ డైరెక్టర్, డీఓపీ, వీఎఫ్ఎక్స్ టీమ్ ఇలా దాదాపు తన అన్ని సినిమాలకు ఒకే టీమ్ పని చేసింది. అందులో చాలా వరకు తన కుటుంబ సభ్యులే ఉన్నారు కూడా. అయితే మహేశ్ బాబు సినిమాకు మాత్రం తన టీమ్లో జక్కన కొన్ని మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజమౌళి చాలా సినిమాలకు పని చేసిన సెంథిల్ కుమార్ స్థానంలో పీఎస్ వినోద్ను, వీఎఫ్‌ఎక్స్ సూపర్‌ వైజర్ శ్రీనివాస మోహన్ స్థానంలో కమల్ కన్నన్ను తీసుకోబోతున్నారని సమాచారం. వీరిద్దరు మాత్రమే కాకుండా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ స్థానాల్లో వేరే వాళ్లని భర్తీ చేయాలని అనుకుంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news