ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ డేట్ అవుట్..

-

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 28 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర బృందం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్టు తెలిపింది..

ఎస్‌ఎస్‌ఎంబీ28.. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. అయితే త్వరలోనే టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. సినిమా టైటిల్ అనౌన్స్ చేయకముందే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కాబోతుందని సంక్రాంతి 13న విడుదల చేయనున్నట్టు తెలిపారు..

ప్రస్తుతం రిలీజ్‌ డేట్‌ని ఖరారు చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇందులో మహేష్‌ లుక్‌ అదిరిపోయింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమాల్లో హీరోలు అందరూ క్లాస్ గానే కనిపించగా ఈ సినిమాలో మహేష్ మాత్రం ఊర మాస్ లుక్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. సిగరెట్ తాగుతూ రోడ్డుపై స్టైల్ గా నడుచుకుంటూ మహేష్ వెళుతున్న లుక్ అభిమానుల్ని ఆకట్టుకుంది. అలాగే వెనకాల లారీ, సైడ్‌లో కారు, పైకి ఎర్రనీ మిర్చీ ఎగురుతుండగా టోటల్‌గా ఫస్ట్ లుక్‌ మాస్‌గా అదిరిపోయేలా ఉంది. దీంతో సినిమాపై అంచనాలు మరిన్ని పెరిగిపోగా సినిమా విడుదలకు అభిమానులంతా ఇప్పటినుంచి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీలా నటించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతం అందించగా మాటలు, దర్శకత్వం త్రివిక్రమ్ అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news