మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తం : కేసీఆర్‌

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. ఇంతకుముందు నాందేడ్ లో బీఆర్ఎస్ సభ పెట్టగానే, మహారాష్ట్ర సర్కారు రైతులకు ఎకరాలకు 6వేల రూపాయలు ఇవ్వడం ప్రారంభించిందని . బీఆర్ఎస్ సభకు ముంతెలిపారు సీఎం కెసిఆర్. బీఆర్ఎస్ పెట్టిన సభకు ముందు ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం ఎందుకు చెయ్యలేదని సీఎం కెసిఆర్ అడిగారు. గులాబీ జెండాలో ఎంత సత్తా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు ఆయన. రూ. 6వేలు సరిపోవని ..ఎకరాకు రూ. 10వేలు ఇవ్వాలని అన్నారు. దేశంలో 75 ఏండ్లుగా రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారని..అయినా వారి సమస్యలు తీరడం లేదన్నారు సీఎం కెసిఆర్ వ్యక్తపరిచారు. జీవితాంతం పోరాటాలు చేస్తూనే ఉండాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన. ఒక్కసారి బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. మహారాష్ట్రలో రాబోయే పంచాయితీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు.

KCR's Party Holds First Rally Outside Telangana In Maharashtra's Nanded

తెలంగాణ రాకముందు అక్కడ ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ప్రతీ రోజూ వాళ్లకు దండం పెట్టి..ఆత్మహత్యలు చేసుకోవద్దని విన్నపించుకున్నట్లు తెలిపారు. కొద్ది రోజులు ఓపిక పట్టాలని కోరినట్లు వెల్లడించారు సీఎం కెసిఆర్. తెలంగాణ వచ్చాక కరెంట్, సాగునీరు, పెట్టుబడి సాయం అందించామని తెలియచేసారు. ఇప్పుడు తెలంగాణలో రైతులంతా ఆనందంగా ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ కంటే మహారాష్ట్రలో సంపద ఎక్కువ ఉందన్నారు. తెలంగాణ కంటే మహారాష్ట్ర మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు సీఎం కెసిఆర్.