చంద్రముఖి -2 లో స్టార్ హీరోయిన్..!

-

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాలలో చంద్రముఖి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2005లో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో నయనతార, జ్యోతిక ఇతర నటీమణులు సైతం ఎంతో అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. దాదాపుగా ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు దర్శకత్వం పి వాసునే వ్యవహరిస్తూ ఉన్నారు. హీరోగా రాఘవ లారెన్స్ నటిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ చిత్రం ప్రకటించిన తర్వాత నుంచి అభిమానులకు ఒక విషయంలో సందేహం కలుగుతోంది.

ఈ చిత్రంలో కీలకమైన పాత్ర చంద్రముఖిగా ఎవరు పోషిస్తారు అనే సందేహం అటు అభిమానుల ప్రేక్షకులలో నెలకొంది. అయితే అందుకు సమాధానంగా బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. చంద్రముఖి సినిమా సీక్వెల్ లో చంద్రముఖిగా కంగన రనౌత్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక తమిళంలో రెండవ సినిమా ఇదీ ఈమెకు. ముఖ్యంగా డైరెక్టర్ వాసు దర్శకత్వంలో నటించడం పై చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ వచ్చే నెల మొదటి వారంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కంగన రనౌత్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అనే చిత్రంతో పాటు, మరొక చిత్రంలో నటిస్తోంది. ఇక చంద్రముఖి సినిమాలో చంద్రముఖిగా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న జ్యోతిక ఒకవైపు.. గంగ అనే పాత్రలో అమాయకంగా కనిపించి భయపెట్టింది. మొదట ఈ సినిమా సీక్వెల్లో జ్యోతిక నీ నటిస్తుందని కోలీవుడ్ మీడియా వర్గాల నుంచి వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు తాజాగా కంగన రనౌత్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news