సినిమాకు కథే బలం, దానినే నమ్ముకొండి గురూ..!!

-

ఒకప్పుడు వివిధ రకాల సినిమా పరిశ్రమ లలో మలయాళం, తమిళ పరిశ్రమ లలో మంచి కథలు ఉండేవి. అదే సమయంలో తెలుగు సినిమా, కన్నడ సినిమాల్లో మసాలా మరియు రొడ్డకుట్టుడు ఎక్కువుగా ఉండేది. తర్వాత కాలంలో టాలీవుడ్ చాలా వరకు తన పందా మార్చుకొని మంచి విజయాలు సాధించింది.

ఇక ప్రారంభంలో కన్నడ సినిమాని అస్సలు ఎవ్వరూ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు . అప్పట్లో కొద్దిగా ఉపేంద్ర సినిమాలు  మాత్రమే తెలుగు లో డబ్ అయ్యేవి. ఆ తర్వాత కిచ్చా సుదీప్ కొంచెం మార్కెట్ సంపాదించాడు. ఇక తర్వాత వచ్చింది యశ్ మరియు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్.ఒక శాండల్ వుడ్ మూవీ పన్నెండు వందల కోట్లు వసూలు చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఇక ఆ సినిమా రికార్డ్స్ దుమ్ము దులిపింది. ఈ సినిమా పై కూడా సెట్స్, ఫైట్స్ హంగామా ఉండటం వల్ల హిట్ అయ్యింది అన్నవాళ్లు కూడా ఉన్నారు.

ఇక అప్పుడు వచ్చింది కాంతారా సినిమా. కాంతార కేవలం నెల రోజుల్లో ఏపీ తెలంగాణలో 50 కోట్ల గ్రాస్ దాటేసింది. హిందీలో 75 కోట్లు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ చూసుకుంటే 400 కోట్లకు వచ్చింది. ఇంతా చేసి దీనికి ఖర్చు పెట్టిన బడ్జెట్ 16 కోట్లే. అసలు ఏ బిజినెస్ లో ఇంత రాబడి వస్తుందంటే తలలు పండిన నిర్మాత, దర్శకుడు, హీరో, కూడా చెప్పలేడు. మన భాష కాని ఒక ప్రాంతానికి చెందిన సంప్రదాయాన్ని దేవుడి ఆచారంతో ముడిపెట్టిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. అందుకే అంటారు సినిమా కు  కథ అనే ఆత్మ ను నమ్ముకొని చేస్తే విజయం కచ్చితంగా వస్తుంది అని.

Read more RELATED
Recommended to you

Latest news