కృష్ణ గారి బయోపిక్.. నాకంత సీన్ లేదు..!

-

మహానటి సినిమాతో బయోపిక్ సినిమాల మీద ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏర్పడేలా చేసింది. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా బయోపిక్ సినిమాల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. ఆ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్, వైఎస్సార్ బయోపిక్ లకు ముహుర్తం పెట్టేశారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ సినిమా మీద కూడా డిస్కషన్స్ మొదలు పెట్టారు. సుధీర్ బాబు కృష్ణ బయోపిక్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని అన్నారు.

కృష్ణ బయోపిక్ పై సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చాడు. తాను కృష్ణ గారి బయోపిక్ చేసేంత సీన్ లేదని. తన నిర్మాణంలో ఆ సినిమా వస్తుందని వార్తలొచ్చాయి. కృష్ణ గారి బయోపిక్ ఆలోచన ఉన్నా చాలామంది ఆ బయోపిక్ చేసేందుకు లైన్ లో ఉన్నారట. కృష్ణ బయోపిక్ కన్నా తన ప్రొడక్షన్ లో మహేష్ తో సినిమా చేయాలని అంటున్నాడు సుధీర్ బాబు. ఆ రేంజ్ కు తన ప్రొడక్షన్ వెళ్లాలని సుధీర్ ఆశిస్తున్నాడు.

సుధీర్ బాబు మొదటి ప్రయత్నంగా నన్ను దోచుకుందువటే సినిమా చేస్తున్నాడు. సెప్టెంబర్ 21న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్ బాబు కృష్ణ గారి బయోపిక్ గురించి ప్రస్థావించాడు.

Read more RELATED
Recommended to you

Latest news