దోపిడి దొంగలకు చుక్కలు చూపించింది.. వైరల్ వీడియో

-

దోపిడి దొంగలకు ఓ మహిళ చుక్కలు చూపించింది. ఒంటరిగా ఉన్నా ఎంతో దైర్యం, సాహసంతో దోపిడి దొంగలను తను ఎదిరించిన తీరును చూసి నెటిజన్లు, అక్కడి స్థానికులు తెగ ముచ్చటపడుతున్నారు. నువ్వు తోపు, గ్రేట్, హీరో అంటూ ఆమెను తెగ పొగుడుతున్నారు. అసలేంజరిగిందో తెలుసుకోవాలంటే మనం దక్షిణాఫ్రికాలోని ఆల్బర్టన్ కు వెళ్లాల్సిందే.

తల్లీకూతురు కారులో షాపింగ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నారు కారులో. మగ తోడు లేకుండా వస్తున్న వాళ్లను గమనించిన దోపిడి దొంగలు ఆ కారును అనుసరించారు. ఆ కారును గమనించిన ఆ మహిళ ఏదో ప్రమాదం జరగబోతున్నదని గ్రహించింది. తన కూతురుకు కూడా చెప్పింది. ఏం జరిగినా నువ్వు కారు డోర్ తీసి బయటికి రాకు అని తెలిపింది.

ఆ కారు అనుసరిస్తున్నా సరే.. అలాగే పోనిస్తూ చివరకు తన ఇంటి దగ్గరకు వచ్చింది. తన ఇంటి ముందు గేటు తన కారు రాగానే ఆటోమెటిక్ గా తెరుచుకుంటుంది. అలా.. తన కారు రాగానే ఆ గేటు తెరుచుకుంది. వెంటనే ఆ కారును అనుసరిస్తూ దోపిడి దొంగల కారు కూడా ఆ గేటు లోపలికి వెళ్లి ఆగింది. వెంటనే కారు దిగిన దొంగలు ముందు కారు దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయాలంటూ అరవ సాగారు. వాళ్ల దగ్గర గన్స్ కూడా ఉన్నాయి. కానీ.. ఆ మహిళ మాత్రం కారు డోర్ ఓపెన్ చేయలేదు. కారును ఆన్ లోనే ఉంచి అలాగే కారును స్పీడ్ గా రివర్స్ పోనిచ్చింది. దీంతో ఆ దొంగల కారును ఢీకొన్నది ఆ మహిళ కారు. ఇంకా స్పీడ్ గా ముందుకు వచ్చి.. మళ్లీ అదే స్పీడ్ తో మరోసారి ఆ కారును ఢీకొట్టింది. ఈ హఠత్పరిణామంతో భయపడిన దోపిడి దొంగలు కారును అక్కడే వదిలేసి పరుగులంకించుకున్నారు. ఈ ఘటన అంతా తన ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ మహిళను దైర్య లక్ష్మితో పోల్చుతున్నారు అంతా.

Read more RELATED
Recommended to you

Latest news