పుష్ప విష‌యంలో క్లారిటీకి వ‌చ్చిన సుకుమార్‌!

ఒక భారీ బ‌డ్జెట్ సినిమా తెర‌కెక్కుతుంటే దాన్ని ఎక్కువ‌గా రెండు భాగాల్లోనే తెర‌కెక్కించాల‌ని డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు ప్లాన్ చేస్తుంటారు. ఇది మూవీకి ప్ల‌స్ పాయింట్‌. ఎందుకంటే త‌క్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలు పొంద‌వ‌చ్చు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ప‌రంప‌ర కొన‌సాగుతోంది. బాహుబ‌లి నుంచి ఎఫ్‌-3వ‌ర‌కు ఇదే సాంప్ర‌దాయం కొన‌సాగుతోంది.

ఇప్పుడు క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పుష్ప విష‌యంలో కూడా ఇదే ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తుంది. పుష్ప సినిమాను కూడా ఇప్పుడు రెండు విభాగాల్లో తీయ‌నున్నారు.

ఇప్ప‌టికే మొద‌టి భాగాన్ని దాదాపు పూర్తి చేసిన సుకుమార్‌.. ఇప్పుడు క‌రోనా కార‌ణంగా కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఈ టైమ్‌లోనే రెండో భాగంపై క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాదిలో ఈ మూవీని ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇందు కోసం బ‌న్నీ కాల్షీట్ల‌ను కేటాయించిన‌ట్టు స‌మాచారం. మ‌రి ఈ మూవీపై అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.