సుకుమార్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ మెంట్ రావాల్సిందా..!

-

మహేష్ తో సినిమా ఇవాళా రేపా అన్నట్టు ఉన్న సుకుమార్ కు అనూహ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా కన్ఫాం అయ్యింది. ఆ సినిమా ఎనౌన్స్ చేసిన కొద్ది గంటలకే మహేష్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని ట్వీట్ చేశాడు. అయితే మహేష్ తన కథ మీద ఇంట్రెస్టింగ్ చూపించట్లేదని సుకుమార్ బన్ని దగ్గరకు వెళ్లే ముందు ఎన్.టి.ఆర్ తో సినిమా ఎనౌన్స్ చేయించాలని ప్రయత్నించాడట.

ఎన్.టి.ఆర్ తో సుక్కు నాన్నకు ప్రేమతో సినిమా చేశాడు. అయితే ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ బిజీలో ఉన్న తారక్ సినిమా చేసే ఆలోచన లేదని చెప్పాడట. జస్ట్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేద్దామన్నా అందుకు ఒప్పుకోలేదట. అందుకే అల్లు అర్జున్ 20వ సినిమా సుకుమార్ డైరక్షన్ లో అంటూ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. అంటే మహేష్ సినిమా కాదన్నాడని చెప్పడానికి ముందే తన తర్వాత చేస్తున్న హీరోతో ఎనౌన్స్ మెంట్ చేయించాలని సుకుమార్ పట్టుబట్టాడు. మొత్తానికి సుకుమార్ ప్లాన్ అలా ఉండగా ఒకవేళ బన్ని కూడా కాదని చెబితే పరిస్థితి ఎలా ఉండేదో మరి.

రంగస్థలం తర్వాత సుకుమార్ తన మీద తనకు కాన్ ఫిడెన్స్ పెరిగిందనిపిస్తుంది. మహేష్ కాదన్న కథతోనే బన్నితో చేస్తున్నాడు మరి ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version