లైక్ ఏయన్నార్.. లైక్ సుమంత్..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్రలో అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ నటిస్తున్నాడని తెలిసిందే. తాత పాత్రలో నటిస్తున్నందుకు సుమంత్ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాడు. బాలకృష్ణ లీడ్ రోల్ చేస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో సుమంత్ లుక్ ఇప్పుడు లీక్ అయ్యింది. కొన్నాళ్లుగా ఫుల్ గడ్డంతో కనిపిస్తున్న సుమంత్ ఐదు సంవత్సరాల తర్వాత క్లీన్ షేవ్ అంటూ ఓ పిక్ ట్విట్టర్ లో పెట్టాడు.

ఇది చూస్తే కచ్చితంగా ఇది ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా కోసమే అంటున్నారు. లైక్ ఏయన్నార్.. లైక్ సుమంత్ అనేలా ఉన్న సుమంత్ కొత్త లుక్ అక్కినేని ఫ్యాన్స్ ను అలరిస్తుంది. బయోపిక్ లో చంద్రబాబుగా రానా లుక్ ఇప్పటికే సంచలనంగా మారగా ఏయన్నార్ గా సుమంత్ ఎలా ఉంటాడు.. సినిమాలో ఏయన్నార్ పాత్ర ఎలా డిజైన్ చేశారు అన్నది డిస్కషన్స్ లో ఉంది.

సినిమాలో విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రాం, సుమంత్ లతో పాటుగా ఇంకా చాలామంది నటీనటులు భాగమవుతున్నారని తెలుస్తుంది. సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news