సండే స్పెష‌ల్ : లైగ‌ర్ కు న‌చ్చిన లేడీ ఎవ‌ర‌బ్బా!

ఖ‌రీద‌యిన కార్లు అంటే ఇష్టం..ఖ‌రీద‌యిన మ‌నిషి కూడా ఇష్ట‌మే! అవును ప్రేమ ద‌గ్గ‌ర అభిమానం ద‌గ్గ‌ర మ‌నిషి ఖ‌రీదు ఎంత‌ని?
విజ‌య్ దేవ‌రకొండ ఇప్పుడంటే ఖ‌రీద‌యిన మ‌నిషి కానీ ఒక‌ప్పుడు అతి సామాన్యుడు.థియేట‌ర్ లో ఎవ్వ‌రికీ తెలియ‌ని మురారి.


అవును ఆయ‌న చూసిన మొద‌టి మ‌హేశ్ బాబు సినిమా అదే! ఇప్ప‌టికీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లైఫ్ ను గుర్తు చేసుకునే స‌గ‌టు కుర్రాడు.. మ‌న ప‌క్కింటి తెలంగాణ పోర‌గాడు అత‌డే!

పెళ్లి చూపులు వ‌ర‌కూ ఎవ్వ‌రికీ తెలియ‌ని కుర్రాడు. ఆ మాట‌కు వ‌స్తే అంత‌కుముందు ప‌ర్వ‌త సానువుల్లో నానితో న‌డ‌క‌లు నేర్చిన కుర్రాడు.. అప్పుడు ఎవ‌డే దేవ‌రకొండ.. ఇప్పుడు ఇత‌డే మ‌న బంగారుకొండ.. అని చెప్పేంత చ‌నువు,చొర‌వ ఆడియెన్స్ కు ఉన్నాయి. కృషి ప‌ట్టుదల ఇంటి చుట్టాల‌యితేనే ఫ‌లితాలు బాగుంటాయి. అందుకు దేవ‌ర‌కొండ విజ‌య్ అతీతుడు కాదు కానీ ఆత్మ బంధువు వాటికి !

తెలంగాణ వాకిట మ‌రో మెగాస్టార్ అని అంతా అంటారు. అవును అది నిజ‌మే క‌ష్ట‌ప‌డి తెచ్చుకున్న పేరు అది. అందుకే లైగ‌ర్ కి అంత స్పీడు.. అంత పొగ‌రు కూడా! ఉండాల్సిందే! మెగాస్టార్ న‌చ్చిన న‌టుడు మ‌రి! ఆ పాటి ఉండాల్సిందే! ప్రిన్స్ మ‌హేశ్ న‌చ్చిన నటుడు అవును ఆ పాటి ఉండాల్సిందే! యాటిట్యూడ్ షో చేస్తే చాలు వివాదాలు ఇంటి చుట్టాల‌వుతాయి. అయినా స‌రే! ఆయ‌నేం చేసినా ఫ్యాన్స్ కు పండుగే! విజ‌య్ దేవ‌ర‌కొండా ఫిదా హై తుమ్ అని అనాల్సిందే!

 

జుల‌పాల జుట్టు కుర్రాడు, తెలంగాణ రాజ‌సం పొగ‌రు క‌లిసిన కుర్రాడు మ‌న బంగారు కొండ విజ‌య్ దేవ‌ర‌కొండ. ఆయ‌నేమ‌యినా స‌రే ఎంత చెప్పినా స‌రే ! ఇప్ప‌టిదాకా ఆయ‌న ప్ర‌త్యేక‌మే. పూరీ తో లైగ‌ర్ , త్వ‌ర‌లో సుకుమార్ తో మ‌రో సినిమా.. ఇంకా చెప్పుకుంటే మ‌నోడుకి స్టోరీ కుద‌రాలే కానీ అన్నీ క్రేజీ ప్రాజెక్టులే! ఇంత హ‌డావుడిలోనూ అమ్మ‌నూ మ‌రిచిపోనూ అలియానూ మ‌రిచిపోను అని అన‌గ‌ల‌డు.

– చిత్ర క‌థంబం, మ‌న లోకం ప్ర‌త్యేకం