సందీప్, తమన్నా ‘నెక్స్ట్ ఏంటి’ టీజర్

-

యంగ్ హీరోల్లో రొటీన్ ఫార్మెట్ లో సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. మనోడు సినిమాల్లో కన్నా బయట ఎక్కువ నటించేస్తాడట అందుకే తనని కొందరు కావాలనే సైడ్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఇదిలాఉంటే సందీప్ కిషన్ హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కొన్నాళ్లుగా ప్రొడక్షన్ హౌజ్ లోనే నలుగుతూ ఉన్న సినిమా నెక్స్ట్ ఏంటి.

ఈమధ్యనే ఆ సినిమా రిలీజ్ కు సన్నాహాలు మొదలు పెట్టారు. సందీప్, తమన్నా జంటగా నటించిన ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ఈ టీజర్ చూస్తే లైఫ్ ఎంజాయ్ చేసే హీరో జీవితంలోకి లైఫ్ మీద మంచి ఆలోచన అవగాహన ఉన్న అమ్మాయి వస్తే ఎలా ఉంటుందో చెప్పే సినిమా నెక్స్ట్ ఏంటి కథ అని తెలుస్తుంది. ప్లే బోయ్ గా సందీప్ టీజర్ లోనే లిప్ లాక్ తో సినిమాలో ఇలాంటి ఉంటాయని హింట్ ఇచ్చాడు.

అసలేమాత్రం ఫాంలో లేని సందీప్ కిషన్, బాహుబలి లాంటి సినిమా చేసినా లాభం లేని తమన్నా ఇద్దరు కలిసి చేస్తున్న ఈ నెక్స్ట్ ఏంటి టీజర్ యువత మెప్పించేలా కట్ చేశాడు దర్శకుడు. డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా సందీప్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి. బాలీవుడ్ లో ఆమీర్ తో ఫనా, హం తుం డైరక్ట్ చేసిన కునాల్ కొహ్లి ఈ సినిమాను డైరక్ట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news