యువ దర్శకుడితో రజనీకాంత్ హ్యాట్రిక్ ఫిల్మ్..స్క్రిప్ట్ రెడీ!

-

తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రజెంట్..‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తన 169 వ చిత్రం ‘జైలర్’ చేస్తు్న్నారు. ఇటీవల విడుదలైన ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ..సినిమాపైన అంచనాలను పెంచింది. కాగా, రజనీ 170 వ సినిమాపైన కోలీవుడ్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో డిస్కషన్ జరుగుతోంది.

రజనీకాంతో గత చిత్రం ‘అన్నాత్తె(తెలుగులో ‘పెద్దన్న’)’ ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ క్రమంలోనే ‘జైలర్’ ఫిల్మ్ పైన అంచనాలు బాగా ఉన్నాయి. రజనీతో 170వ సినిమా చేయడం కోసం యువ దర్శకుడు పా. రంజిత్ రెడీ గా ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

రజనీతో గతంలో ‘కబాలి’‘కాలా’ చిత్రాలను తీసిన పా.రంజిత్..ఈ సారి ముచ్చటగా మూడోసారి సూపర్ హిట్ ఫిల్మ్ ..హ్యాట్రిక్ చేయాలని భావిస్తున్నారని టాక్. ఇప్పటికే స్టోరి విన్న రజనీ..గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు టాక్. రజనీకాంత్ ను సూపర్ స్టైలిష్ గా చూపించడంలో గత చిత్రాలను మించి ఇందులో ప్లాన్ చేసుకుంటున్నారట దర్శకుడు పా.రంజిత్.

Read more RELATED
Recommended to you

Latest news