ఆర్టీసీ బస్సులో వైఎస్ షర్మిల ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు షర్మిల. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాప్రస్థానంలో భాగంగా RTC బస్ ప్రయాణికులతో మాట్లాడటం జరిగిందని… టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయని వాపోయారని తెలిపారు. మరోవైపు తమకు 16గం. డ్యూటీ వేస్తున్నారని, ప్రశ్నించే కార్మిక సంఘాలను నిర్వీర్యం చేశారని డ్రైవరన్న ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు వైఎస్ షర్మిల.
KCR దిక్కుమాలిన పాలనకు నిదర్శనం ఇదని ఆగ్రహించారు. RTCని KCR ఖతం పట్టించిండని…రూ.20 టికెట్ రూ.40లైంది.రోడ్లు బాగలేవని రూట్లు తగ్గించారని ఫైర్ అయ్యారు. కార్మికులైనా బాగుపడ్తరనుకుంటే అది కూడా లేదు. 16గంటల వెట్టిచాకిరి అని మండిపడ్డారు. జీతాలు కూడా సక్కగ ఇస్తలేరు.RTC సంఘాలను సర్వనాశనం చేసిండు.RTCని ప్రభుత్వంలో విలీనం చేయాలని డ్రైవరన్నలు కోరుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రజాప్రస్థానంలో భాగంగా RTC బస్ ప్రయాణికులతో మాట్లాడటం జరిగింది. టికెట్ల రేట్లు అమాంతం పెరిగాయని వాపోయారు.మరోవైపు తమకు 16గం. డ్యూటీ వేస్తున్నారని, ప్రశ్నించే కార్మిక సంఘాలను నిర్వీర్యం చేశారని డ్రైవరన్న ఆవేదన వ్యక్తం చేశారు. KCR దిక్కుమాలిన పాలనకు నిదర్శనం ఇది.#PrajaPrasthanam pic.twitter.com/ChBP3jytUK
— YS Sharmila (@realyssharmila) June 23, 2022