మహేష్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. తొలిసారి డ్యూయల్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి.

ఇందులో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఆస్థాన నాయిక టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఈ పిక్చర్ లో భారీ యాక్షన్ సీన్స్ ను త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని సమాచారం. అంటే ఎన్‌ఆర్‌ఐ పాత్రలో ఒక గెటప్ ఉండనుండగా, రాజకీయ నాయకునిగా మరో పాత్రలో మెరువనున్నాడట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news