సూపర్ స్టార్ కృష్ణకు తీరని కోరికలు అవేనా..?

-

మనిషన్నాక కోరికలు ఉండడం సహజం. అయితే కొంతమంది ఆ కోరికలను నెరవేర్చుకునే దిశగా ప్రయాణిస్తే.. మరికొంతమంది తీరని కోరికలతో స్వర్గస్తులవుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రుల కోరికలను పిల్లలు తెలుసుకొని తీర్చడం మనం ఎప్పటినుంచో గమనిస్తున్న విషయమే. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం సూపర్ స్టార్ కృష్ణ తీరని కోరికల మధ్య స్వర్గస్తులవడం సినీ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పవచ్చు. కథానాయకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కృష్ణ ఆ తర్వాత పద్మాలయా స్టూడియో నిర్మించి, నిర్మాతగా మారారు. ఆయనలో దర్శకుడు , ఎడిటర్ కూడా ఉన్నారు. 350 కి పైగా సినిమాలలో నటించిన కృష్ణ అత్యధికంగా మల్టీ స్టారర్ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు.

ఇక ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే.. అబ్బాయి మహేష్ బాబు మంచి స్థానంలో ఉన్నారు. మనవళ్ళు కూడా తెరపైకి వచ్చారు . నిండైన జీవితం గడిపిన కృష్ణకు కొన్ని తీరని కోరికలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇకపోతే తెలుగు తెరకు గూడచారిని పరిచయం చేసింది కృష్ణగారే.. అందుకని ఆయనను అందరూ ఆంధ్ర జేమ్స్ బాండ్ అనేవారు. అయితే ఆయన కొడుకు మహేష్ బాబును జేమ్స్ బాండ్ గా చూడాలని కృష్ణ ఆశపడ్డారు . కానీ మహేష్ బాబు తన తండ్రి చేసిన పాత్రలు, సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు అలా ఒక కోరిక తీరలేదని చెప్పాలి.

ఇక తర్వాత హిందీలో ప్రసారమైన” కౌన్ బనేగా కరోడ్ పతి ” కి గెస్ట్ గా వెళ్లాలని అనుకున్నారు. కానీ తెలుగులో కూడా “ఎవరు మీలో కోటీశ్వరులు” రెండు సీజన్లు వచ్చినా కూడా కృష్ణను ఆయన ఆరోగ్య దృష్ట్యా..ఈ షో కి ఆహ్వానించకపోవడం కూడా గమనార్హం. ఇలా కూడా ఆయన కోరిక తీరలేకపోయింది.

మరొక కోరిక విషయానికి వస్తే.. తనయుడు రమేష్ బాబు మహేష్ బాబుతో కృష్ణ నటించిన అబ్బాయిలు ఇద్దరినీ కూడా చైల్డ్ ఆర్టిస్టులుగా… ఆ తర్వాత హీరోలుగా పరిచయం చేశారు. ఇప్పుడు మనవళ్ళు కూడా తెరంగేట్రం చేశారు. మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ వన్ నేనొక్కడినే లో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.. అయితే ఈ సినిమా కంటే ముందే గౌతమ్ కృష్ణతో కృష్ణ నటించాలని చెప్పేవారట. అయితే అది కుదరలేదు. కనీసం మంచి కథ వస్తే మహేష్ తో కలిసి మరో సినిమా చేయాలనుకున్నారట అది కూడా జరగలేదు. అలాగే మహేష్ బాబును బాలీవుడ్ చిత్రాలలో చూడాలని కలలు కన్నారట అది కూడా నెరవేర లేదు. ఇలా ఎన్నో తీరని కోరికల మధ్య ఆయన స్వర్గస్తులవడం బాధాకరం అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version