మహేష్ చేత సిగరెట్ మానిపించిన ఆ స్నేహితుడు ఎవరు..?

-

సూపర్ స్టార్ మహేష్ ఇప్పుడంటే ఎలాంటి అలవాట్లు లేకుండా ఉన్నాడు కాని ఒకప్పుడు మాత్రం అతని చేతిలో సిగరెట్ కంపల్సరీగా ఉండేదని ఎంతమంది తెలుసో.. ముఖ్యంగా మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో ఐదారు సినిమాల దాకా ఈ చైన్ స్మోకింగ్ హ్యాబిట్ ఉండేదట. అవలీలగా రోజుకు 2, 3 పెట్టల సిగరెట్ తాగేవాడట. అలాంటి చైన్ స్మోకర్ లాంటి మహేష్ ను అసలు సిగరెట్ తాగకుండా చేశాడు ఓ స్నేహితుడు.

ఇంతకీ ఎవరా స్నేహితుడు అంటే.. అలెన్ కార్ అనే రైటర్ రాసిన బుక్ అని తెలుస్తుంది. మహేష్ స్మోకింగ్ హ్యాబిట్ గురించి తెలుసుకున్న ఓ స్నేహితుడు అతనికి ఆ బుక్ ఇచ్చాడట. మహేష్ దాన్ని చదువి స్మోకింగ్ మానేశాడని తెలుస్తుంది. ఇక పెళ్లి జరగడం ఆ తర్వాత పిల్లలు వచ్చాక మద్యపానం కూడా మానేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి మహేష్ చేత స్మోకింగ్ హ్యాబిట్ మానిపించిన ఆ బుక్ దాన్ని రాసిన రైటర్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

ఇంతకీ ఆ బుక్‌ ఏంటో తెలుసా.? అలెన్‌ కార్‌ రాసిన ‘ ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌’. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా అమ్ముడుపోయిన ఈ బుక్‌ చాలా పాపులర్‌. ఆన్‌లైన్‌ షాపులలో ఈజీగా దొరుకుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version