తన కెరియర్ లో బ్యాడ్ టైమ్ ను ఫేస్ చేసిన సూపర్ స్టార్.. కారణం అదేనా..?

-

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప నటుడో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీకి ఏదైనా కొత్తగా పరిచయం చేయాలంటే అది కేవలం కృష్ణా తోనే సాధ్యం అయిందని చెప్పవచ్చు. కృష్ణ 1970, 80 లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా పేరు పొందారు కృష్ణ. ఇక ఎన్టీఆర్ ,శోభన్ బాబు, ఏఎన్నార్ వంటి హీరోల ను మించిపోయి టాప్ పొజిషన్ లో ఉండేవారు.Happy Birthday superstar Krishna: 'I owe it all to you,' says Mahesh Babu | Entertainment News,The Indian Express

అలా ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమాలను చేయడంలో కృష్ణ కి సాధ్యపడుతుంది. దీంతో ప్రేక్షకులంతా తనవైపు తిరిగే వారట. కృష్ణ కెరియర్లో విభిన్నమైన కథలు, కౌబాయ్, జేమ్స్బాండ్ తరహా లో అన్ని కథలను కూడా ఆ రోజుల్లోనే ప్రేక్షకులకు అందించిన ఘనత కృష్ణ గారిది అని చెప్పవచ్చు. ఇక సింహాచలం చిత్రం అప్పట్లో ఒక బాహుబలి సినిమా లాంటిది. అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం ఎన్నో రికార్డులను సైతం తిరగరాసింది. అయితే ఎంతటి సూపర్ స్టార్ కైనా ఒక బ్యాడ్ పేస్ అనేది ఉండనే ఉంటుంది అని చెప్పవచ్చు.Manjula Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ, మంజుల ప్రేమకు నో చెప్పారట! చివరికి ఎవరు ఒపించారో తెలుసా?? | News Orbit

అలాంటి వాటిని కృష్ణ కూడా ఫేస్ చేశారు. అయితే టాప్ హీరో గా కొనసాగుతున్న సమయంలో వరుసగా 12 చిత్రాలు ప్లాప్ అయ్యాయట. ఆ సమయంలో కృష్ణ గారు ఒక హీరోగా పనికిరారని ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆయన పక్కన పెట్టేశారు. ఈ క్రమంలో ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు నిర్మాతగా పరిచయం చేస్తూ తన సొంత బ్యానర్లోనే పాడి పండితులు అనే సినిమాను చేసినట్లు తెలిపారు కృష్ణ. ఇక ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో కృష్ణ గారికి మళ్లీ పూర్వవైభవాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించారు. ఈ విషయాన్ని కృష్ణ కూతురు మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. అయితే కేవలం కథల ఎంపికలో సరిగ్గా లేకపోవడం వల్లే కృష్ణ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news