సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో …?

-

టాలీవుడ్ లో సురేందర్ రెడ్డి కి స్టైలిష్ డైరెక్టర్ అన్న పేరున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ధృవ తీసిన సూరి ఆ తర్వాత మెగాస్టార్ తో సైరా ని తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయితే ఆ తర్వాత ప్రాజెక్టే ఇంత వరకు ఫైనల్ కాలేదు. ప్రభాస్ తో మహేష్ బాబుతో…అలాగే మరోసారి రాం చరణ్ తో సురేందర్ రెడ్డి సినిమా కన్‌ఫర్మ్ అయిందని వార్తలు వచ్చాయి. కాని ప్రస్తుతం ఒక వార్త బయటకు వచ్చింది.

సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఎనర్జిటిక్ హీరో రాం తో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం రాం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ సినిమాలో నటించాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. ఇప్పటికే రాం సురేందర్ రెడ్డి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. సూరి చెప్పిన కథ రాం కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సురేందర్ రెడ్డి సినిమాని ఎంత స్టైలిష్ గా తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. అంతేకాదు హీరో ని చాలా పవర్ ఫుల్ గా చూపించడంలో సూరి స్టైలే వేరు. ఈ కాంబినేషన్ లో సినిమా అనగానే ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి నెలకొంది.

ఇక రాం ఇస్మార్ట్ శంకర్ తో భారీ మాస్ హిట్ అందుకొని ఉన్నాడు. అలాగే ఇప్పుడు నటించిన రెడ్ కూడా మాస్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో రాం డ్యూయల్ రోల్ లో నటించాడు. తమిళం లో సూపర్ హిట్ గా నిలిచిన తడం కి అఫీషియల్ రీమేక్ గా రెడ్ ని తెరకెక్కించారు. నివేదా పేతు రాజ్ మాళవిక శర్మ హీరోయిన్స్ గా ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందించారు.

Read more RELATED
Recommended to you

Latest news