దేశవ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మొగుతున్నాయి. కరొన బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇక, గత 24 గంటల్లో 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. అలవాగే 357 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారిసంఖ్య 8,102కి చేరుకుంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,86,579 కు చేరింది. అటు 1,41,029 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రికవరీ రేటు 49.2 శాతంగా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే 8 రాష్ట్రాలు కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నాయి. అసోం, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, నాగాలాండ్, ఒడిసా, పుదుచ్చేరి, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రికవరీ రేటు ఆశాజనకంగా ఉంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మాత్రమే 5 వేలకు మించి యాక్టివ్ కేసులు ఉన్నాయి.