త‌క్కువ‌ ధ‌ర‌ల‌కే లెనోవో కొత్త ల్యాప్‌టాప్‌లు..!

-

కంప్యూట‌ర్స్ త‌యారీదారు లెనోవో భార‌త్‌లో చ‌వ‌క ధ‌ర‌ల‌కే ప‌లు నూత‌న ల్యాప్‌టాప్‌ల‌ను విడుద‌ల చేసింది. ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 సిరీస్‌లో ఈ ల్యాప్‌టాప్‌లు విడుద‌ల‌య్యాయి. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తోపాటు నిత్యం ప‌నిచేసుకునేందుకు ఈ ల్యాప్‌టాప్‌లు అనువుగా ఉంటాయ‌ని లెనోవో తెలిపింది. ఐడియా ప్యాడ్ 3 సిరీస్‌లో 14, 15 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో ల్యాప్‌టాప్‌లు ల‌భిస్తున్నాయి. వీటిల్లో ఇంటెల్ 10వ జ‌న‌రేష‌న్ కోర్ ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు.

Lenovo Ideapad Slim 3 laptops launched in India

ఈ ల్యాప్‌టాప్‌ల‌లో హెచ్‌డీడీ + ఎస్ఎస్‌డీ స్టోరేజ్ ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు. యూఎస్‌బీ 3.1 పోర్టులు 2, ఫింగ‌ర్ ప్రింట్ స్కాన‌ర్‌, వెబ్‌క్యామ్‌కు ప్రైవ‌సీ ష‌ట‌ర్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను ఈ ల్యాప్‌టాప్‌ల‌లో అందిస్తున్నారు. ఇవి చాలా త‌క్కువ మందం క‌లిగి ఉంటాయి. బ‌రువు కేవ‌లం 1.6 కిలోలు మాత్ర‌మే ఉంటాయి. వైఫై 6, డాల్బీ ఆడియో, 8.5 గంట‌ల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను కూడా ఈ ల్యాప్‌టాప్‌ల‌లో అందిస్తున్నారు.

లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 సిరీస్ ల్యాప్‌టాప్‌లు ప్లాటినం గ్రే, ఆబిస్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల‌య్యాయి. వీటి ప్రారంభ ధ‌ర రూ.26,990గా ఉంది. అమెజాన్‌, లెనోవో ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు లెనోవో ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ల‌లో ఈ ల్యాప్‌టాప్‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news