చిరంజీవి మూవీలో భాగం కానున్న సుశాంత్..!

-

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా.. నాగార్జున మేనల్లుడిగా కాళిదాసు మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన సుశాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోలో హీరోగా సినిమాలు చేసిన ఈయన అందులో కొన్ని విజయం సాధించాయి. మరికొన్ని డిజాస్టర్ పాలయ్యాయి. దాంతో స్టార్ హీరోల సినిమాలలో కీలకపాత్రలు లభిస్తే నటించాలనే నిర్ణయం తీసుకున్నాడు సుశాంత్. అలా అతను నటించిన తొలి చిత్రం అలవైకుంటపురంలో.. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో మాస్ ఆడియన్స్ లోకి సుశాంత్ సైతం చొచ్చుకొనిపోయాడు.

ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ రావణాసుర చిత్రంలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏప్రిల్ ఏడవ తేదీన పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న రావణాసురలో సుశాంత్ కీ రోల్ ప్లే చేశాడు. సుశాంత్ మేకవర్ లుక్ చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు. ఇందులో రవితేజ సుశాంత్ పై చిత్రీకరించిన యాక్షన్ పార్ట్ మాస్ కూడా ఆకట్టుకుందని తెలుస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా సుశాంత్ చోటు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి సోదరిగా కీర్తి సురేష్ నటించగా.. ఆమె ప్రియుడిగా సుశాంత్ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళ్ వెర్షన్ లో ఈ పాత్ర నిడివి తక్కువే అయినా ఇక్కడ సుశాంత్ ను దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ ను కాస్త కొంచెం పెంచినట్లు.. ఒక పాటలో సైతం సుశాంత్ కనిపిస్తాడని అంటున్నారు.. ఇక మార్చి 18వ తేదీన సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్కును విడుదల చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సుశాంత్ అటు చిరంజీవి, ఇటు రవితేజ చిత్రాలలో నటిస్తూ తన పరిధిని పెంచుకుంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news