సీనియర్ సిటిజన్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్…!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులని పెట్టడం వలన భవిష్యత్తు లో ఏ ఇబ్బంది ఉండదు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లు పదవీ విరమణకు మంచి ఎంపిక. పన్ను మినహాయింపు నుంచి వడ్డీ దాకా ఎన్నో లాభాలని పొందొచ్చు. 60 ఏళ్ల పౌరుడు ఎవరైనా SCSSలో పెట్టుబడి పెట్టేయచ్చు.

రిటైర్ అయిన నెలలోపు కూడా మీరు 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాకా SCSSలో డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ ఇస్తారు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ప్రభుత్వం గొప్ప వార్తను అందించగలదు. ఈ నెలాఖరులోగా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లని మార్చవచ్చు. సీనియర్ సిటిజన్ మరికొంత కాలం ఎదురు చూస్తున్నారు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అకౌంట్ ని ఓపెన్ చేస్తే అధీకృత బ్యాంక్ మరియు పోస్టాఫీసులో అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చు. సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ కింద కేవలం రూ. 1000తో పొదుపు ఖాతాను ఓపెన్ చెయ్యచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 15 లక్షలుగా ఉంది. బడ్జెట్ 2023లో రూ.30 లక్షలకు పెంచారు.

మై ఫండ్ బజార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO వ్యవస్థాపకుడు వినీత్ ఖండారే వడ్డీ రేటులో తదుపరి సవరణకు అవకాశం లేదు అన్నారు. -Sec దిగుబడుల పెరుగుదల వలన ప్రభుత్వం తక్కువ వ్యవధిలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచచ్చని అంటున్నారు. వడ్డీ రేటు ఇటీవల సవరించబడినప్పటికీ మరొక సవరణ ఆశించబడలేదు.

రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పన్ను మినహాయింపు కిందకి వస్తుంది. పెట్టుబడిని మరో మూడు సంవత్సరాలు పొడిగించవచ్చు. బడ్జెట్ అనంతర నియమం ప్రకారం రూ. 20,000 పెట్టుబడి పెడితే ప్రతి త్రైమాసికంలో రూ. 400 రాబడిని పొందొచ్చు. ఐదు సంవత్సరాలకు మొత్తం రాబడి రూ. 8000 అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news