‘ సైరా ‘ను ఎందుకు చూడాలంటే..?

-

మెగాస్టార్ చిరంజీవి నటించిన నూటయాభై సినిమాలు ఒక ఎత్తైతే.. ఈ సినిమా మరో ఎత్తు. చిరు కెరీర్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా 151వ సినిమాగా తెర‌కెక్కుతోంది. ఇక ఈ సినిమాను ఎందుకు ? చూడాలి. ఈ సినిమాలో ఉన్న స్పెష‌ల్ ఎలిమెంట్స్ ? ఏంటో తెలుసుకుందాం.

– క‌ర్నూలు జిల్లాకు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చ‌రిత్ర ఇది.

– ఓ తెలుగు వీరుడి క‌థ దేశం అంతా తెలియ‌జెప్పేందుకు.. ఈ సినిమాకి అన్ని భాషల్లో క్రేజ్ తీసుకురావడానికి ఆ భాషా నటులను తీసుకొచ్చారు. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, రవికిషన్ లాంటి నటులతో పాటు నయనతార, తమన్నాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

– ఇప్పటివరకు రాజమౌళి సినిమాల్లోనే భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ చూశాం. ఇప్పుడు ‘సైరా’ కూడా విజువల్స్ తో ఆకట్టుకోనుంది. ఈ సినిమాలో 3800 వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయని సమాచారం.

– సైరా సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేశారు. యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ నుండి నిపుణులను తీసుకొచ్చారు. 35 రోజుల పాటు యాక్ష‌న్ సీన్లు షూట్ చేశారు.

– సైరా యాక్ష‌న్ సీన్స్‌లో ఏకంగా 2 వేల మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు, ఫైట‌ర్లు పాల్గొన్నారు.

– ఫారిన్ న‌టుల కోసం వంది మందిని ఎంపిక చేసి వారిలో కేవ‌లం ఏడుగురిని మాత్రమే ఎంపిక చేశారు.

– ఈ సినిమాలో జాత‌ర పాట‌ను 4500 మంది ఆర్టిస్టుల‌తో 14 రోజుల పాటు షూట్ చేశారు.

– సైరాలో ఒక్క క్లైమాక్స్ ఎపిసోడ్ కోసం ఏకంగా రూ.72 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. జార్జియాలో అండ‌ర్ వాట‌ర్ ఫైట్ కూడా తీశారు.

– సైరా ప‌వ‌న్ వాయిస్ ఓవ‌ర్‌తో స్టార్ట్ అయ్యి ప‌వ‌న్ వాయిస్ ఓవ‌ర్‌తోనే ముగుస్తుంది.

– సైరాలో ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఝాన్సీల‌క్ష్మీ భాయ్ పాత్ర‌లో అనుష్క న‌టించారు. ఆమె పోస్ట‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ కాలేదు. ఇది సినిమాలో ఊహించ‌ని ట్విస్ట్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version