సైరా టీజర్ పోస్టర్.. ఖడ్గం చెబుతున్న కథ

-

మెగాస్టార్ చిరంజీవ్ 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహారెడ్డి మూవీ టీజర్ ఈ నెల 21న అనగా మంగళవారం ఉదయం 11:30 నిమిషాలకు రిలీజ్ అవనుంది. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించి అఫిషియల్ గా టైటిల్ పోస్టర్ తప్ప ఏది రిలీజ్ కాలేదు.

అయితే ఇదవరకే సైరాలో చిరు లుక్ లీక్ అవగా మెగాస్టార్ బర్త్ డే కానుకగా సైరా టీజర్ రాబోతుంది. టీజర్ పై అంచనాలు పెంచేలా టీజర్ పోస్టర్ వచ్చేస్తుంది. ముఖ్యంగా నరసింహారెడ్డి ఖడ్గం చూపిస్తూ టీజర్ మీద అంచనాలు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. వీర ఖడ్గంతో సత్తా చాటేందుకు వస్తున్న సైరా నరసింహారెడ్డి టీజర్ ఎలా ఉండబోతుందో అని మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్న సైరా సినిమాలో నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తుంది. బిగ్ బి అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. 2019 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news