అధికారంలోకి వచ్చిన వారంలోపే సీపీఎస్ రద్దు: జగన్

-

బాబు ఐదు పార్టీలతో సంసారం చేసి వదిలిపెట్టారు..ఇక మిగిలింది కాంగ్రెస్..

 

రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా కోటవురట్ల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఊసరవెల్లి కూడా సిగ్గుపడే విధంగా బాబు రంగులు మారుస్తున్నారు. తెదేపా పాలనకు బ్రిటీష్ పాలనకు పెద్ద తేడా ఏమీలేదు… విద్యాలయాల్లో అధిక ఫీజుల వసూళ్లతో పాటు పెట్రోల్, డీజల్ పై వ్యాట్ రూపంలో ప్రజల సొమ్ముని లోకేశ్ పాకెట్ మనీ కోసం వాడుకుంటున్నారు అంటూ చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.

అమరావతి బాండ్లకు రూ.2వేల కోట్లు వచ్చాయని ప్రగల్భాలు పలుకుతున్న తెదేపా నేతలు.. పక్కరాష్ట్రాలు తక్కువ వడ్డీకి బాండ్లు తీసుకొస్తే చంద్రబాబు మాత్రం 10.32 శాతానికి బాండ్లు తెచ్చి అదేదో ఆయన వల్లే అంత క్రేజ్ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. నీరు – చెట్టు పథకం కింద రూ.20 కోట్లు దోచుకున్నారు. విశాఖ తర్వాత అధికంగా భూ అక్రమాలు పాయకరావు పేటలోనే జరిగాయని అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోపోవడం హాస్వాస్పందంగా ఉందన్నారు. అమరావతిలో ఏది చేసిన తాత్కాలిక నిర్మాణంగానే ఇప్పటికీ బెబుతున్న నేతలు ఇక శాశ్వత నిర్మాణాలకు ఎప్పుడు ఇటుకలేస్తారని ఘాటుగా విమర్శించారు. చెరువు తవ్వకాల్లో వచ్చిన మట్టిని అమ్ముకుంటూ ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేయడం అవినీతికి నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు పార్టీలని పెళ్లాడి వదిలిపెట్టారని ఇక కాంగ్రెస్తో పొత్తుకోసం కుటుంబ సభ్యుల ద్వారా రహస్య ఒప్పందాలు చేయించుకోవడం చంద్రబాబుకే చెల్లుతుందని బాబుని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news