మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మంగా తెరకెక్కుతోన్న సినిమా సైరా. కర్నూలు జిల్లాకు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను కొణిదెల కంపెనీ బ్యానర్‌పై చిరు తనయుడు, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ రూ.280 కోట్ల బడ్జెట్‌తో స్వయంగా నిర్మిస్తున్నారు. సురేందర్‌రెడ్డి సైరాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా తెలుగుతో పాటు తమిళ్, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే సినిమా యూనిట్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇప్పటికే టీజర్‌తో పాటు రిలీజ్ అయిన తొలి ట్రైలర్ దుమ్ము రేపుతోంది. ఈ క్రమంలోనే గురువారం మరో సైరా ట్రైలర్ 2 పేరుతో మరో ట్రైలర్ రిలీజ్ చేశారు.
కేవలం 59 సెకన్ల నిడివి ఉన్న ఈ ట్రైలర్ మరోసారి మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. బ్రిటీషర్లకు, నరసింహారెడ్డికి మధ్య జరిగే సన్నివేశాలతో వచ్చే పవర్ ఫుల్ డైలాగులతో ఈ ట్రైలర్ కట్ చేశారు. ఇండియాను ఈజీగా దోచుకోవచ్చు… ట్యాక్స్‌లను 300 % పెంచండి అని బ్రిటీషర్ల నాయకుడు హుకుం జారీ చేస్తాడు. బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ.. మన బంగారంతో తిరిగి రావాలి అని బ్రిటీషర్ల నాయకుడు చెపుతాడు.
అది మనది మన ఆత్మగౌరవం… గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు అని చిరు అంటే ఆయన గురువు అమితాబ్ చంపడమో చావడమో ముఖ్యం కాదు.. గెలవడం ముఖ్యం అని సైరా పాత్రలో ఉన్న చిరుకు ఉపదేశిస్తాడు… ఇక చివరగా ఉరి కంభానికి వేలాడుతోన్న చిరు ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ప్రాణికి లక్ష్యం ఒక్కటే స్వాతంత్య్రం… స్వాతంత్య్రం లాంటి డైలాగులు బాగా పేలాయి. ఏదేమైనా సైరా రెండో ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు ఆకాశానికి తీసుకు వెళ్లిపోయింది.