తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆయా బ్యాంకుల్లో ఖాతాదారులు నానా హైరాన పడుతున్నారు. అయితే ఈ వార్తలపై భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తిప్పికొట్టింది. ఇవి కేవలం పుకార్లు మాత్రమేనని తేల్చిపడేసింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. పైగా మరింత మూలధనం సమకూర్చి ప్రభుత్వ రంగ బ్యాంకులను పటిష్టం చేయడానికి కేంద్రం తగిన అన్ని ప్రయత్నాలూ చేస్తోందన్నారు.
ఆర్‌బీఐ కూడా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, ఒక ప్రకటన జారీ చేసింది. పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)పై ఆర్‌బీఐ చర్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘బ్యాంకుల మూసివేత’ ప్రచారం షికార్లు చేసింది. ఈ సంధర్భంలోనే ఏ ప్రభుత్వ రంగ బ్యాంకును కూడ మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.