‘సరిలేరు నీకెవ్వరు’ సాంగ్ లో తమన్నా లుక్ లీక్…!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు కు సంబందించిన ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుండి బయటకు వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు సాంగ్స్, ఆడియన్స్ ని మరియు ప్రత్యేకంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుని యూట్యూబ్ లో అధిరిపోయే వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక వాటితో సినిమాపై అంచనాలు కూడా విపరీతంగా ఏర్పడ్డాయి. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారిగా ఒక మిలిటరీ మేజర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నుండి మూడవ పాటను రాబోయే సోమవారం రిలీజ్ చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ ని ప్రస్తుతం చిత్రీకరిస్తోంది సినిమా యూనిట్. హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మిగతా హీరోల కంటే మహేష్ సినిమాల్లో ఇంట్రో సాంగ్స్ అదిరిపోతాయి అనే టాక్ ఉంది. అలానే ఈ సినిమాలో కూడా గత సినిమాలకు మించేలా దర్శకుడు అనిల్ రావిపూడి ఇంట్రో సాంగ్ ని ప్లాన్ చేసాడట. ఇక ఈ సాంగ్ లో సూపర్ స్టార్ తో కలిసి చిందేసే తమన్నా లుక్ నేడు లీక్ అయి పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గ్రీన్ కలర్ టీ షర్ట్, మిలిటరీ ప్యాంట్ వేసుకుని ఉన్న తమన్నా లుక్ ని బట్టి చూస్తుంటే,

ఈ సినిమాలో హీరో మిలిటరీ మేజర్ కావడంతో ఆ విధమైన లుక్ లోనే తమన్నా కూడా కనబడనుందని తెలుస్తోంది. సాధారణంగా ప్రత్యేక గీతాల్లో హీరోయిన్స్ మంచి హాట్ డ్రెస్సులు వేసుకుని అదరగొడతారు, కాగా ఈ విధంగా కొంత డిఫరెంట్ గా ఆర్మీ స్టైల్ డ్రెస్ లో అదరగొట్టనున్న తమన్నా , రేపు సినిమా రిలీజ్ తరువాత ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుందో చూడాలి. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను జనవరి 11న రిలీజ్ చేయబోతున్నారు……!!