అతనితో డేటింగ్ కు సిద్ధం.. తమన్నాకి అతను ఎక్కడో టచ్ అయ్యాడా..!

-

మిల్కీ బ్యూటీ తమన్నా ఓ హీరోతో డేటింగ్ కు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అమ్మడు అడగాలే కాని క్యూ కట్టే వాళ్లు ఎంతమందో మరి అమ్మడు ఎవరితో డేటింగ్ కు వెళ్లాలనుకుంటుందో తెలుసా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో సహజీవనానికి సిద్ధం అంటుంది. సంజు సినిమాలో రణబీర్ పక్కన నటించిన విక్కీ కౌశల్ తో అమ్మడు డేటింగ్ కు రెడీ అంటుంది. ఈమధ్యనే ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ సినిమాతో కూడా సత్తా చాటాడు.

మరి విక్కీ కౌశల్ తమన్నాకి ఎక్కడ టచ్ అయ్యాడో ఏమో కాని అమ్మడు అతని పేరు జపిస్తుంది. దశాబ్ధ కాలంగా స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న తమన్నా ఈమధ్య కెరియర్ లో కొద్దిగా వెనుకపడ్డట్టు అనిపించినా మళ్లీ ఊపందుకుంది. దేవి-2, దటీజ్ మహాలక్ష్మి సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. సైరా నరసింహా రెడ్డి సినిమాలో కూడా తమన్నా ఛాన్స్ పట్టేసింది.

Read more RELATED
Recommended to you

Latest news