దేవ‌త అవ‌తారం ఎత్తిన త‌మ‌న్నా.. అరిటాకు లో భోజ‌నం

ఎప్పుడు పొట్టి పొట్టి బ‌ట్ట‌లలో కనిపించే మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా దేవ‌త అవ‌తారం ఎత్తింది. అంతే కాకుండా.. అరిటి ఆకు లో భోజనం చేస్తు తన ఫోటో సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమాను ల‌తో పంచుకుంది. అలాగే అరిటి ఆకు లో భోజనం చేస్తూ ఉంటే నిజం గా నే తాను దేవ‌త అని త‌న‌కే ఫీలింగ్ వ‌స్తుంద‌ని కామెంట్ ను కూడా జ‌త చేసింది.

అయితే త‌మ‌న్నా దేవ‌త గేట‌ప్ ఎందుకు వేసింది అనే డౌట్ అభిమాను ల్లో నెల‌కొంది. అయితే కొంత మంది ఒక సినిమా షూటింగ్ లో భాగం గా దేవ‌త గేటప్ వేసింది అని అంటున్నారు. మ‌రి కొంత మంది మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా.. స‌ర‌దా గా దేవ‌త అవ‌తారం గేట‌ప్ వేసింది కావ‌చ్చు అని అంటున్నారు. ఎది ఏమైనా దేవ‌త గేట‌ప్ లో మిల్క్ బ్యూటీ త‌మ‌న్నా అచ్చం దేవ‌త లాగే ఉంది. అయితే త‌మ‌న్నా ప్ర‌స్తుతం ఎఫ్ 3 తో పాటు మెగాస్టార్ చిరంజీవి భోళ శంక‌ర్ అనే సినిమా లో కూడా న‌టిస్తుంది.