గులాబీ గౌనులో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ..

-

సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ ఎక్కువ కాలం కొనసాగడం చాలా కష్టం. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు కాబట్టి, కొద్దిగా ఫేడ్ అవుట్ అయితే వాళ్ళకి పట్టించుకోవడమే మానేస్తారు. అలాంటి పరిస్థితులు ఉన్న ప్రస్తుత తరుణంలో హీరోయిన్ గా ఏళ్ళ పాటు నిలబడటం అంటే మాటలు కాదు. అలా సక్సెస్ అయిన కొద్ది మందిలో తమన్నా కూడా ఒకరు. అప్పుడెప్పుడో మంచు విష్ణు హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తమన్నా, ఇప్పటికీ కొనసాగుతుండడం, టాప్ లో ఉండడం నిజంగా అదృష్టమే.

సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ వైవిధ్య భరితమైన ఫోటోలకి ఫోజులిస్తూ కుర్రకారుని మంత్రముగ్ధులని చేసేలా పోస్టులు పెడుతుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గులాబీ రంగు గౌనులో ఒదిగిపోయిన మిల్కీ బ్యూటీ, పాలల్లో గులాబీ పువ్వు పడితే ఎలా ఉంటుందో అలా ఉంది. సత్యదేవ్ హీరోగా గుర్తుందా శీతాకాలంలో హీరోయిన్ గా చేస్తున్న తమన్నా, బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకున్న అంధాదున్ తెలుగు రీమేక్ లో విభిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. ఈ సినిమాలో నితిన్ హీరోగా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news